తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటనలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత విశ్వక్ "ఫలక్నామా దాస్" అనే సినిమాలో హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్న ఈ మూవీ ద్వారా విశ్వక్ కి మాస్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు వచ్చింది.

అలాగే ఈ మూవీ ద్వారా దర్శకుడిగా కూడా విశ్వక్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కెరియర్ను ప్రారంభించిన తర్వాత చాలా కాలం పాటు మంచి విజయాలను అందుకుంటూ కెరీర్ను మంచి స్థితిలో విశ్వక్ ముందుకు సాగించాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చాలా అపజయాలను అందుకుంటు వస్తున్నాడు. వరుసగా మెకానిక్ రాఖీ , లైలా అనే మూవీలతో రెండు అపజయాలను విశ్వక్ అందుకున్నాడు. ఇకపోతే విశ్వక్ హీరోగా రూపొందిన లైలా మూవీ ఘోర పరాజయాన్ని అందుకుంది.

ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో భాగంగా విశ్వక్ మాట్లాడుతూ ... లైలా మూవీ లో హీరో లేడీ గెటప్ లో కనిపించవలసి ఉంటుంది. దానితో ఈ సినిమా కథలో నటించడానికి ఎవరు ముందుకు రాలేదు. దానితో నలుగురు హీరోలు ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారు అని చెప్పాడు. కానీ లైలా మూవీ కథను రిజెక్ట్ చేసిన ఆ నలుగురు హీరోలు ఎవరు అనేది మాత్రం విశ్వక్ చెప్పలేదు. ఇక అంత డేరింగ్ డెసిషన్ తో విశ్వక్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ ను అందుకుంది. ఇలా డేరింగ్ డెసిషన్ తో చేసిన లైలా మూవీ తో విశ్వక్ కి భారీ అపజయం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

VS