
జన నాయగన్ మీ చివరి సినిమానా? అనే ప్రశ్న ఎదురు కాగా దానికి ఆయన చెప్పిన సమాధానం ఇదేనని మమితా బైజు తెలిపారు. ఆ విషయం తాను ఇప్పుడే చెప్పలేనని అది 2026 ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు. జన నాయగన్ సినిమా షూటింగ్ అంతా సరదాగా జరిగిదని ఆమె పేర్కొన్నారు. సినిమా షూట్ చివరి రోజున అందరూ ఎమోషనల్ అయ్యారని మమిత బైజు కామెంట్లు చేశారు.
స్టార్ హీరో విజయ్ కూడా ఎమోషనల్ అయ్యారని అందుకే టీమ్ తో కలిసి విజయ్ ఫోటోలు కూడా దిగలేదని మామితా బైజు అభిప్రాయం వ్యక్తం చేశారు. జన నాయగన్ సినిమాలో తన పాత్ర గురించి మాత్రం ఇప్పుడే చెప్పలేనని నా పాత్రను స్క్రీన్ పై చూడాలని ఆమె కామెంట్లు చేశారు. ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. 2025 సంవత్సరం జనవరి నెల 9వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
జన నాయగన్ సినిమా మొదలైనప్పటి నుంచి ఈ సినిమా విజయ్ చివరి సినిమా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా ప్రచారం జరుగుతోంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. జన నాయగన్ సినిమా కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.