ఏపీలోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ సినిమాలలో నటించాలి అంటూ చిన్నప్పటి నుంచి అనుకునేవాడు. ఆ కోరికతోనే తర్వాత చెన్నై వెళ్లిపోయాడు . శ్రీకాంత్ పేరుని కాస్త శ్రీరామ్ గా మార్చుకొని చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఆ తర్వాత స్టార్ హీరోగా మారాడు . "రోజాపూలు" సినిమాతో స్టార్ హీరోగా మారిన శ్రీకాంత్ తెలుగు - తమిళం - కన్నడం లో మంచి మంచి సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవల హరికథ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి తన నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు.
కాగా ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలతో వెబ్ సిరీస్లతో మళ్ళీ తన కెరియర్ని ముందుకు తీసుకెళ్తున్న శ్రీరామ్ కి బిగ్ బ్రేక్ పడింది . ఈ సీనియర్ హీరో ని డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న శ్రీరామ్ కి వైద్య పరీక్షలు నిర్వహించి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించారు. అంతేకాదు అనంతరం నుంగంబాకం స్టేషన్ కి హీరో శ్రీరామ్ ని తరలించి సుమారు రెండు గంటలుగా విచారిస్తున్నారు. ఇదే విషయాన్ని చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు తెలిపారు. మాజీ ఏఐఏడిఎంకే కార్య నిర్వాహకుడు ప్రసాద్ నుండే శ్రీరామ్ డ్రగ్స్ కొనుక్కున్నట్లు పోలీసులు తెలిపారు . అంతేకాదు డ్రగ్స్ కేసులో అన్నాడీఎంకే కార్యనిర్వాహకుడు ప్రసాద్ తో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ విచారణ సమయంలోనే వారు ఇచ్చిన సమాధానంతో హీరో శ్రీరామ్ పేరుని బయటకు తీసుకొచ్చారు . శ్రీరామ్ ని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు . దీంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శ్రీరామ్ చాలా చాలా సైలెంట్ పర్సన్ అని అలాంటి వ్యక్తికి డ్రగ్స్ తో సంబంధం ఉందా..? అంటూ షాక్ అయిపోతున్నారు..!