లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా త్రిష హీరోయిన్గా శింబు కీలక పాత్రలో గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తాజాగా థగ్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు . ఇక పోతే చాలా సంవత్సరాల క్రితం కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో నాయకన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేస్తుంది. నాయకన్ సినిమా తర్వాత దాదాపు 38 సంవత్సరాల అనంతరం కమల్ హాసన్ , మణిరత్నం కాంబోలో రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా అపజయం సాధించిన ఈ మూవీలోని నటనకి మంచి ప్రశంషలు దాక్కయి. ఇకపోతే తాజాగా మణిరత్నం "థగ్ లైఫ్" మూవీ ఫెయిల్యూర్ గురించి ఓపెన్ అయ్యాడు. కమల్ హాసన్ , నా కాంబోలో చాలా సంవత్సరాల క్రితం నాయకన్ అనే సినిమా వచ్చింది. అది అద్భుతమైన విజయాన్ని అందుకుంది. థగ్ లైఫ్ సినిమా రేంజ్ మూవీ అవుతుంది అని చాలా మంది ఆశించారు.

కానీ వారికి ఆ స్థాయి అనుభూతిని నేను అందించలేకపోయాను. అందుకు నన్ను క్షమించండి. ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ అయ్యింది  అనే కంటే కూడా ఇది ఒక చిన్న నిరీక్షణ అనుకోండి. మరికొన్ని రోజుల్లో ఒక అద్భుతమైన మూవీ తో మేమిద్దరం మీ ముందుకు వస్తాం అని మణిరత్నం చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా మణిరత్నం చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: