తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో కృష్ణంరాజు ఒకరు. ఈయన తన కెరీర్లో ఎన్నో సినిమాలలో హీరోగా నటించాడు. కానీ కృష్ణంరాజుకు భక్త కన్నప్ప మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో కృష్ణం రాజు హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీని నిర్మించాడు. దానితో ఈయనకు ఈ సినిమా ద్వారా నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా 1976 వ సంవత్సరం విడుదల అయింది. మరికొంత కాలంలోనే ఈ సినిమా విడుదల అయ్యి 50 సంవత్సరాలు కూడా పూర్తి కాబోతుంది. ఇకపోతే భక్త కన్నప్ప సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం.

70 వ దశకంలో మైథాలజీ , భక్తి రస చిత్రాలు ప్రేక్షకులను బాగానే పలకరిస్తూ ఉండేవి. కానీ అప్పటి యువత ఆ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. అలాంటి సమయంలోనే కృష్ణం రాజు మైథాలజీ సినిమాలతో కూడా మధ్య వయస్సు వ్యక్తులను , యువతను ప్రేక్షకులకు థియేటర్లకు రప్పించాలి అనే ఆలోచనకు వచ్చారట. అందులో భాగంగా కన్నడలో రాజ్ కుమార్ చేసిన బెడర కన్నప్ప స్పూర్తితో కన్నప్ప అనే సినిమాను రూపొందించాలి అని నిర్ణయానికి వచ్చాడట. దానితో మధుసూదనరావు దర్శకత్వంలో భక్త కన్నప్ప సినిమాను నిర్మించాలి అని కృష్ణం రాజు అనుకున్నారట. అందులో భాగంగా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసి , కొన్ని పాటలను కూడా రికార్డు చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల మధుసూదనరావు ఆ సినిమా నుండి తప్పుకోవడంతో కొత్త దర్శకుడు కోసం కృష్ణం రాజు వెతుకులాటను మొదలు పెట్టాడు. అందులో భాగంగా అదే సమయంలో ముత్యాల ముగ్గు సినిమాతో బాపు దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాపు దర్శకత్వంలో భక్త కన్నప్ప సినిమాను రూపొందించాలి అని కృష్ణం రాజు అనుకున్నాడట. 

అందులో భాగంగా ఆయనను సంప్రదించగా ఆయన అందుకు ఒప్పుకొని మధుసూదనరావు తయారుచేసిన స్క్రిప్టులో కొన్ని మార్పులు , చేర్పులను వెంకటరమణతో చేయించాడు. స్టోరీ మొత్తం రెడీ అయ్యాక కృష్ణం రాజు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో మొత్తం అవుట్ డోర్ లోనే కంప్లీట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడట. అందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడానికి దాదాపు పది కిలో మీటర్ల దూరంలో బుట్టాయిగూడెం అడవి ప్రాంతంలో షూటింగ్ చేయాలి అని నిర్ణయానికి వచ్చాడట. అక్కడ షూటింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారట. ఇక ఆ సమయంలో ఈ సినిమాను 20 లక్షల భారీ బడ్జెట్ తో 70 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ను నిర్వహించారట. ఈ సినిమా కోసం కృష్ణం రాజు అత్యంత ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతున్న సమయంలో కృష్ణం రాజు సన్నిహితులు చాలా మంది అనవసరంగా చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. రిస్క్ అవుతుంది అని కూడా చెప్పారట. కానీ కృష్ణం రాజు మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ఈ మూవీ ని నిర్మించాడట. ఇక భారీ బడ్జెట్ తో కృష్ణం రాజు నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని ఆయనకు నటుడిగా , నిర్మాతగా మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: