కొన్ని కొన్ని సినిమాలు అనౌన్స్ చేసాక ఆగిపోతూ ఉంటాయి. అలాంటి సినిమానే అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన  బిగ్  ప్రాజెక్ట్ ఈ "ఐకాన్". అయితే కొన్ని కారణాలవల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది . అల్లు అర్జున్ మిగతా సినిమాలతో బిజీ అవ్వడం.. రోజురోజుకీ అల్లు అర్జున్ రేంజ్  పెరిగిపోవడంతో .. ఈ సినిమా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూనే వచ్చింది. ఈ సినిమా ఆగలేదని తర్వాత తీస్తామని దిల్ రాజు పలు సందర్భాలలో క్లారిటీ ఇచ్చారు.  అయినా కూడా అల్లు అర్జున్  చేసే ఛాన్స్ లేదు అంటూ జనాలు మాట్లాడుకున్నారు.



పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయిందని.. ఐకాన్ లాంటి కాన్సెప్ట్ తో సినిమాను అల్లు అర్జున్ చూస్ చేసుకోవడం లేదని మాట్లాడుకున్నారు.  ఫైనల్లీ అదే విషయాన్ని మరొకసారి కన్ఫామ్ చేసిన్నటలింది దిల్ రాజు.  ఐకాన్ సినిమాలో హీరో అల్లు అర్జున్ ఉంటాడా..? ఉండడా..? అనే విషయంపై తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు . "పుష్ప 1,పుష్ప 2,అట్లీతో సినిమా ఇలా అల్లు అర్జున్ ఒకటి తర్వాత ఒకటి సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు . ఈ సినిమా కథ  రెలివెంట్ గా ఉంటుందా ..? అని అడిగితే ఐకాన్ వచ్చిన తర్వాత ఆయనతో సినిమా చేయాలని అనుకోవడం లేదని కాకపోతే స్క్రిప్ట్ మాత్రం చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది అని " దిల్ రాజు చెప్పారు .




అంటే ఈ సినిమా నుండి ఆల్మోస్ట్ అల్లు అర్జున్ వెనక్కి వచ్చేసినట్టే . అల్లు అర్జున్ లేనట్టే అంటూ క్లారిటీ వచ్చేసింది . ఇది యూనివర్సల్ స్క్రిప్ట్ అంటూ తెలుస్తుంది . తమ్ముడు సినిమా రిలీజ్ అయిన తర్వాత వేణు శ్రీరామ్ తో ఆ ఫైల్ బయటకు  తీస్తాడని అనుకుంటున్నాను అంటూ కూడా దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.  దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఐకాన్ సినిమాకి సంబంధించి  వార్తలు వైరల్ అవుతున్నాయి . "ఓకే అల్లు అర్జున్ ఈ సినిమాలో సూట్ అవ్వడు ..మరి ఏ హీరో సెట్ అవుతాడు..??" అంటూ రకరకాలుగా జనాలు మాట్లాడుకుంటున్నారు .




అయితే అల్లు అర్జున్ కాకుండా ఈ క్యారెక్టర్ కి సూట్ అయ్యే హీరో అంటూ ఉంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే అని .. సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. మరి కొందరు నిజమే అల్లు అర్జున్ ఈ క్యారెక్టర్ కి సూట్ కాకపోవచ్చు అల్లు అర్జున్ తో చేస్తే ఈ సినిమా వేస్ట్ అయిపోతుంది.  అదే విజయ్ దేవరకొండ లాంటి హీరోతో చేస్తే కచ్చితంగా సినిమాకి నుంచి రివ్యూ తో పాటు మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి అంటూ ఓ  రేంజ్ లో పొగిడేస్తున్నారు . గతంలో చాలామంది అల్లు అర్జున్ ప్లేస్ ని రీ ప్లేస్ చేయాల్సి వస్తే విజయ్ దేవరకొండ పేరే చెప్పడం గమనారహం..!

మరింత సమాచారం తెలుసుకోండి: