సినిమా ఇండస్ట్రీలో హీరోకి గానీ , హీరోయిన్ కి కానీ ఒక అద్భుతమైన విజయం సూపర్ జోష్ ను తీసుకువస్తూ ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ కూడా బ్లాక్ బస్టర్ విజయంతో ఫుల్ జోష్లో ఉన్నాడు. అసలు విషయం లోకి వెళితే ... వెంకటేష్ గత కొంతకాలంగా మంచి విజయాలను అందుకోలేదు. ఆయన నటించిన కొన్ని సినిమాలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చిన ఆ సినిమాలు నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యాయి. అలాంటి సమయంలోనే వెంకటేష్ ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీనితో ఒక్క సారి వెంకటేష్ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసారు. దానితో వెంకటేష్ తన తదుపరి మూవీ ని ఎవరితో చేస్తాడు. ఇలాంటి సినిమా చేస్తాడు అనేది జనాల్లో అత్యంత ఆసక్తిగా మారింది. అలాంటి సమయంలోనే వెంకటేష్ కి సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వెంకటేష్ నాలుగు సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదటగా వెంకటేష్ ... చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో చిన్న క్యామియో పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీలోనూ , ఆ తర్వాత దృశ్యం 3 లో నటించబోతున్నట్లు , ఈ మూవీ ల తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం అనే టైటిల్ తో తెరకెక్కబోయే సినిమాలో వెంకటేష్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత వెంకటేష్ ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: