ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి అనారోగ్య సమస్యలతో హాస్పటల్లో జాయిన్ అయ్యారు అంటూ మంగళవారం అనగా ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారాయి .. అలాగే అంజనాదేవి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మెగా ఫ్యామిలీ ఆమెను అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారంటూ వార్తలు బయటకు వచ్చాయి . అయితే ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ పనులను పక్కనపెట్టి హైదరాబాద్ వచ్చారని కూడా ప్రచారం జరిగింది .. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా క్యాబినెట్ సమావేశం మధ్యలోనే హైదరాబాద్‌కు వెళ్లిపోయారంటూ పలు పుకార్లు వైరల్ గా మారాయి .. ఇక‌ దీంతో మెగా అభిమానులు ఒక్కసారిగా కొంత ఆందోళనకు గురయ్యారు .

అలాగే అంజనా దేవి త్వరగా కోలుకోవాలని అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడ‌తం మొదలుపెట్టారు .. అయితే అంజన దేవి ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు .. ఈ మెర‌కు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టారు .. అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది .. అమ్మ ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం బయటకు వస్తుంది .. ఆరోగ్యపరంగా ఆమె ఎంతో క్షేమంగా ఉన్నారు అంటూ నాగబాబు తన పోస్ట్ లో క్లారిటీ ఇచ్చారు .. నాగబాబు పోస్టుతో మెగా అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు . అయితే వయసు పైపడుతున్న క్రమంలో అంజ‌నా దేవి జనరల్  చెక్ అప్ కోసం తరచూ ఆసుపత్రికి వెళ్లి వస్తూ ఉంటారు .. ఈ క్రమంలోనే అంజనమ్మ ఆరోగ్యంపై ఈ తప్పుడు వార్తలు వస్తున్నాయని గతంలోను ఇలాగే జరగా మెగా ఫ్యామిలీ తర్వాత క్లారిటీ ఇచ్చింది .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: