
త్రిష ఆ స్టార్ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆ ఫోటోను ఆమె తల్లి షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీని సైతం షేర్ చేయడంతో ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ రూమర్ల గురించి త్రిష స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా ప్రేమలో మునిగిపోతే అది కొందరిని తికమక చేస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. త్రిష ఈ విషయం గురించి తన ఉద్దేశం పూర్తిస్థాయిలో వెల్లడించడానికి ఇష్టపడలేదు.
మరోవైపు హీరోయిన్ త్రిష పెళ్లి గురించి గురించి వేర్వేరు సందర్భాల్లో వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని త్రిష వేర్వేరు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ప్రస్తుతానికి త్రిష నటనపై మాత్రమే దృష్టి పెట్టారు. భవిష్యత్తులో వివాహ బంధంలోకి అడుగు పెడితే ఆ విషయాలను అధికారికంగా వెల్లడిస్తానని ఆమె చెబుతున్నారు.
త్రిష కెరీర్ మొదలై 20 సంవత్సరాలు కాగా హీరోయిన్ గా ఇప్పటికీ త్రిష సత్తా చాటుతూనే ఉన్నారు. వయస్సు పెరుగుతున్నా గ్లామరస్ గా కనిపించడం ఈ బ్యూటీకి కలిసొచ్చింది చెప్పవచ్చు. తెలుగులో విశ్వంభర సినిమాలో త్రిష నటిస్తుండగా ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలను సృస్తిస్తుందో చూడాలి. హీరోయిన్ త్రిష కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. త్రిషను అభిమానించే ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.