
నాని `హిట్ 3`, నాగచైతన్య `తండేల్`, అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన `కుబేర` మూవీస్ 100 కోట్ల క్లబ్ లో చేరాయి. చిన్న చిత్రాలుగా వచ్చిన `మ్యాడ్ స్క్వేర్`, `కోర్టు`, `సింగిల్` సినిమాలు బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. రేపు విడుదల కాబోయే `కన్నప్ప`తో ఈ ఏడాది ఫాస్టఫ్ ఫినిష్ కాబోతుంది. రూ. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
అయితే టాలీవుడ్ లో అసలు బొమ్మ ముందుంది. ఈ ఏడాది సెకండాఫ్ లో పెద్ద పెద్ద చిత్రాలు రిలీజ్ కు క్యూ కట్టాలి. సెకండాఫ్ ను యూత్ స్టార్ నితిన్ `తమ్ముడు` మూవీతో ప్రారంభించబోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కాబోతోంది. వారం గ్యాప్ లో సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కించిన `ఘాటి` మూవీ విడుదలకు సిద్ధమయింది. జూలై 24న పవన్ కళ్యాణ్ `హరి హర మీరమల్లు` రిలీజ్ కానుంది.
ఆగస్టులో మాస్ మహారాజా రవితేజ `మాస్ జాతర` చిత్రంతో పాటు ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ `వార్ 2`, రజనీకాంత్ - ఉపేంద్ర - ఆమిర్ ఖాన్ - నాగార్జున కలసి `కూలీ` చిత్రాలు రాబోతున్నాయి. విజయ్ `కింగ్‌డమ్` కూడా జూలై లేదా ఆగస్టులో రావొచ్చని అంటున్నారు.
సెప్టెంబర్ చూసుకుంటే ఈ నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `ఓజీ`, అలాగే నట సింహం నందమూరి బాలకృష్ణ `అఖండ 2` చిత్రాలు థియేటర్స్ సందడి చేయనున్నాయి. రీసెంట్ గా టీజర్ తోనే భారీ అంచనాలను ఏర్పర్చుకున్న తేజ `మిరాయ్`, సాయి ధరమ్ తేజ్ `సంబరాల యేటిగట్టు` కూడా సెప్టెంబర్ లోనే రానున్నాయి
ఒకవేళ సెప్టెంబర్ ను మిస్ చేసుకుంటే ఈ రెండు చిత్రాలు అక్టోబర్‌లో రిలీజ్ కావొచ్చు. సిద్ధు జొన్నలగడ్డ `తెలుసుకదా`, ప్రదీప్ రంగనాథన్ `డ్యూడ్` మూవీస్ అక్టోబర్‌లో కర్చీఫ్ వేశాయి. ఇక డిసెంబర్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రొమాంటిక్ హారర్ కామెడీ `ది రాజా సాబ్` రిలీజ్ కానుంది. డిసెంబర్ 5 ఈ చిత్రం విడుదల కానుండగా.. డిసెంబర్ 25న అడివి శేష్ `డకోయిట్` రిలీజ్ అవుతుంది. మరి 2025 సెకండాఫ్‌లో వచ్చే ఈ చిత్రాలు టాలీవుడ్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేస్తాడో చూడాలి.