కన్నప్ప సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చిన జనాలు ఒక డైలాగ్ ను బాగా హైలైట్ చేస్తున్నారు . ప్రభాస్ అభిమానులు ఆ డైలాగ్ ని పదేపదే గుర్తు తెచ్చుకొని మరి నవ్వుకుంటున్నారు . దీనితో సోషల్ మీడియాలో ఆ డైలాగ్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.  కన్నప్ప మూవీ కొద్దిసేపటి క్రితమే  థియేటర్స్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే . టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ అందుకుంది.


సినిమాలో మంచు విష్ణు పర్ఫామెన్స్ కూడా బాగుంది అన్న రివ్యూస్ వినిపిస్తున్నాయి . ఈ సినిమాను ఆవ ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్‌స్  ఫ్యాక్టరీ బ్యానర్ల పై మంచు మోహన్ బాబు నిర్మించారు.  కాగా సినిమాలో మోహన్ లాల్ - అక్షయ్ కుమార్ - కాజల్ - ప్రభాస్ లాంటి స్టార్స్ కీలక పాత్రలో నటించి మెప్పించారు . మరీ ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సినిమాకి వస్తున్న రివ్యూస్ వేరే లెవెల్ అనే చెప్పాలి.  సినిమా మొత్తానికి కర్త - కర్మ - క్రియ అంతా ప్రభాస్ నే అంటూ రెబెల్ ఫాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

 

సినిమా ఫస్ట్ అఫ్ అస్సలు బాలేదని సెకండాఫ్ మాత్రం వేరే లెవెల్ అని మంచు విష్ణు దగ్గర నుంచి ఇలాంటి ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయలేకపోయామని జనాలు సినిమాకి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు . కాగా ఇదే మూమెంట్ లో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అదే విధంగా డైలాగ్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి అని మరీ ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి గురించి వచ్చిన డైలాగ్ మాత్రం వేరే లెవెల్ లో ఉంది అని థియేటర్స్ లో డైలాగ్ వింటున్నప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నవ్వులే నవ్వులు అంటూ మాట్లాడుకుంటున్నారు .



కాగా  ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సమయాను సారం సీన్ లో భాగంగా "ఇంతకీ నీకు పెళ్లి అయ్యిందా..??" అని ప్రభాస్ ని ప్రశ్నించగా.." నా పెళ్లి గురించి ఎందుకులే" అంటూ ప్రభాస్ ఇచ్చిన ఆన్సర్ చాలా వెరైటీగా నాటీగా ఉండింది అని.. ఈ డైలాగ్ తెరపై చాలా బాగా పండింది అని .. చాలా బాగా ఎంటర్టైన్ చేసింది అని.. ఈ డైలాగ్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించింది అని జనాలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.  అంతేకాదు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు హాట్ టాపిక్ గానే ట్రెండ్ అవుతూ ఉంటుంది . అసలు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా..? చేసుకోడా..? అన్న విషయం గురించి అభిమానులు ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటారు.  అలాంటి క్క ఇంట్రెస్టింగ్ టాపిక్ పై మంచు విష్ణు పెట్టిన ఒక డైలాగ్ బాగా వర్కౌట్ అయింది.  అయితే సినిమా కథంతా బాగున్న  రైటింగ్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . మొత్తానికి మంచు విష్ణు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నట్టే అనిపిస్తుంది . చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో..???

మరింత సమాచారం తెలుసుకోండి: