
ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో ఈ రెండు చిత్రాలు థియేటర్స్‌లోకి దిగబోతున్నాయి. ఆల్రెడీ కూలీ చిత్రంపై హైప్ పిక్స్ కు చేరింది. ఇప్పటివరకు సినిమా నుంచి బయటకు వచ్చిన కంటెంట్ ప్రేక్షకుల్లో అంచనాలను తారా స్థాయిలో పెంచింది. అందుకు తగ్గట్టే బిజినెస్ కూడా జరుగుతోంది. తాజాగా భారీ పోటీ నడుమ కూలీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ను మేకర్స్ విక్రయించారు. డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.
బలమైన పంపిణీ దారులు సినిమాను దక్కించుకోవడంతో.. నైజాం, కృష్ణ, ఈస్ట్, వైజాగ్, గుంటూరు ఏరియాల్లో కూలీకి గ్రాండ్ రిలీజ్ దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వార్ 2 విషయంలో మాత్రం సరైన ప్లానింగ్ లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల బయటకు వచ్చిన టీజర్ ఫాన్స్ ని ఆకట్టుకున్నప్పటికీ.. సాధారణ ప్రేక్షకులకు సరైన కిక్ ఇవ్వలేకపోయింది. దీనికి తోడు ఇంతవరకు ఈ సినిమా తెలుగు థియేటర్ రైట్స్ విక్రయించలేదు. ఎన్టీఆర్ క్రేజ్ దృష్ట్యా తెలుగు హక్కులను కనీసం రూ. 100 కోట్లకు విక్రయించాలని నిర్మాతలు భావిస్తున్నారు.
అయితే తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 70 కోట్ల మేర రేటు పలుకుతున్నాయి. అంతకుమించి పెట్టేందుకు పంపిణీ దారులు ముందుకు రావడం లేదు. కానీ వార్ 2 మేకర్స్ రూ. 100 కోట్ల దగ్గరే పట్టుదలగా కూర్చుని ఉన్నారు. లేదంటూ సొంతంగా రిలీజ్ చేసుకుంటామని అంటున్నారు. ఫలితంగా సినిమాకు మినిమమ్ పబ్లిసిటీ కూడా జరగట్లేదు. ఒక హిందీ సినిమా వస్తుందనే బజ్ తప్ప ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అనే ఫీలింగ్ ఆడియన్స్ లో ఏమాత్రం కలగట్లేదు. తెలుగు వాళ్ళు ఎవరైనా తీసుకుంటేనే సినిమాపై హైప్ జనరేట్ అయ్యేలా పరిస్థితి ఉందంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించి వార్ 2 మేకర్స్ జాగ్రత్త పడతారా? లేదా? అన్నది చూడాలి.