ఒకప్పుడు టాలీవుడ్ లో ఉన్న టాప్ కమెడియన్స్ లో సునీల్ ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ లక్షలాదిమంది అభిమానులు సంపాదించుకున్న సునీల్.. ఆ తర్వాతి కాలంలో హీరోగా టర్న్ తీసుకున్నాడు. `అందాల రాముడు`, `మర్యాద రామన్న`, `పూల రంగ‌డు` వంటి చిత్రాలు సునీల్ కు మంచి విజయాలను అందించాయి. కానీ కథల ఎంపికలో చేసిన పొరపాట్లు కారణంగా ఎక్కువ కాలం సునీల్ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు.


ప్రస్తుతం విలన్ గా, సహాయక నటుడిగా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. అయితే సునీల్ తన కెరీర్ మొత్తంలో తీసుకున్న చెత్త డిసెష‌న్ ఒకటి ఉంది. అదే `భ‌లే భ‌లే మగాడివోయ్` సినిమాను రిజెక్ట్ చేయడం. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సూప‌ర్ హిట్ మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ సునీలే. నాని క‌న్నా ముందు సునీల్ కు క‌థ వినిపించాడ‌ట మారుతి.


హీరోకు మతిమరుపు అనే కాన్సెప్ట్ సునీల్ గా బాగా న‌చ్చింద‌ట‌. అయితే సినిమా మొత్తం కామెడీతో నిండిపోయింది.. కొన్ని యాక్షన్ సీన్స్, మాస్ సీన్స్ యాడ్ చేయమని సునీల్ కోర‌గా.. అందుకు మారుతి ఒప్పుకోలేదు. దాంతో సున్నితంగా సునీల్ రిజెక్ట్ చేశాడు. ఇక సేమ్ స్టోరీని భ‌లే భ‌లే మ‌గాడివోయ్ టైటిల్ తో నాని సినిమా చేశాడు. 2015లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో నాని కెరీర్ మ‌రింత ఊపందుకుంది. ఒక‌వేళ సునీల్ ఖాతాలో భ‌లే భ‌లే మ‌గాడివోయ్ ప‌డుంటే ప్ర‌స్తుతం ఆయ‌న కెరీర్ మ‌రోలా ఉండేది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: