ఎంతో ప్రసిద్ధి చెందిన అన్నపూర్ణ స్టూడియో మరియు రామానాయుడు స్టూడియోలకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) భారీ షాక్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయ్. ట్రేడ్ లైసెన్స్ ఫీజులకు సంబంధించి జరిగిన తనిఖీల్లో,స్టూడియోలు అనేకకాలంగా తక్కువ మొత్తంలోనే ఫీజులు చెల్లిస్తున్నట్లు బల్దియా గుర్తించింది. దీంతో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది.  దీనితో అధికారికంగా ఈ రెండు ప్రముఖ సినీ స్టూడియోలకు నోటీసులు జారీ చేస్తూ అసలు చెల్లించాల్సిన మొత్తాన్ని తక్షణం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.


తనిఖీల్లో అన్నపూర్ణ స్టూడియో అసలు చెల్లించాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు రూ. 11.52 లక్షలు కాగా, వారు సంవత్సరాలుగా కేవలం రూ. 49,000 మాత్రమే చెల్లిస్తున్నట్లు బయటపడింది. అదే విధంగా, రామానాయుడు స్టూడియోస్ అసలు చెల్లించాల్సిన మొత్తం రూ. 1.92 లక్షలు అయినప్పటికీ, వారు కేవలం రూ. 1,900 మాత్రమే చెల్లిస్తున్నారని జీహెచ్‌ఎంసీ సర్కిల్–18 అధికారులు గుర్తించారు.ఇంకా విచారణలో, ఈ రెండు స్టూడియోలు వ్యాపార విస్తీర్ణాన్ని (బిజినెస్ ఏరియా) గణనీయంగా తక్కువగా చూపించినట్లు, దాంతో భారీ స్థాయిలో పన్నుల ఎగవేత జరుగుతోందని అధికారులు తేల్చారు.



బిజినెస్ విస్తీర్ణం తగ్గించి చూపడం వల్ల ట్రేడ్ లైసెన్స్ ఫీజు కూడా తగ్గిపోతుందని, ఈ విషయంలో తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు.ఈ సమగ్ర నివేదికల నేపథ్యంలో, జీహెచ్‌ఎంసీ రెండూ స్టూడియోలకూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. అసలు చెల్లించాల్సిన మొత్తం మొత్తాన్ని వెంటనే చెల్లించడంతో పాటు భవిష్యత్‌లో కూడా సరిగ్గా వివరాలు సమర్పించాల్సిందిగా ఆదేశించింది. అవసరమైతే మరింత పెద్దస్థాయి విచారణకు కూడా సిద్ధమని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు కూడా ఈ విధంగా పన్నుల ఎగవేతకు పాల్పడటం ఆశ్చర్యకరమని పలువురు పేర్కొంటున్నారు. ఈ కేసుతో ఇతర వ్యాపార సంస్థలపై కూడా బల్దియా దృష్టి మరింత పదును పెట్టే అవకాశం ఉందని అంచనా. దీంతో సోషల్ మీడియాలో ఇదే విషాయాని బాగా ట్రోల్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: