
అనుకున్నట్లుగానే మొదటి భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయాలని మరో రెండవ భాగాన్ని 2027లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు. కొన్ని నెలలుగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతూ ఉన్నప్పటికీ ఎక్కడో ఒకచోట లీకైన ఫోటోలు కూడా అందరిని ఆసక్తికనబరిచాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సైతం విడుదల చేయగా విఎఫ్ఎక్స్ బిజిఎం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు
ముఖ్యంగా బ్రహ్మ, విష్ణువు, శివుడిని చాలా అద్భుతంగా చూపించారు.5000 ఏళ్ల సంవత్సరం నుంచి 2500 కోట్ల మంది ప్రజలు ఆదరించేటువంటి ఒక ఇతిహాస గాధ రాముడు vs రావణుడు కథ.. రావణుడు శక్తి.. రాముడు మాత్రం ధర్మం, త్యాగం కలవారు. ఇందులో రవి దూబే లక్ష్మణుడీగా.. సన్నీ డ్యూయల్ హనుమంతుడిగా కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ అందరిని అద్భుతంగా ఆశ్చర్యపరిచేలా కనిపిస్తోంది. రాముడుగా రణబీర్ , రావణుడుగా యశ్ లుక్స్ మాత్రం అందరిని ఆకట్టుకుంటున్నాయి కానీ ఇందులో సీతని మాత్రం చూపించలేదు. సుమారుగా రూ .500 కోట్ల బడ్జెట్ పైగా తెరకెక్కిస్తున్న రామాయణ సినిమా కోసం చాలామంది సినీ ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఏ మేరకు ఏ విధంగా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.