తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల.. ఇటీవల `కుబేర` మూవీతో బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా నాగార్జున ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం తమిళంలో కన్నా తెలుగులో బాగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కుబేర హిట్ నేపథ్యంలో శేఖర్ కమ్ముల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుంది అన్నది చాలా ఆసక్తికరంగా మారింది.


అయితే నిన్న మొన్న‌టి వరకు శేఖర్ కమ్ముల లైన‌ప్‌లో న్యాచురల్ స్టార్ నాని ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ కారణంగా మరో ఏడాదిన్నర వరకు నాని శేఖర్ కమ్ములకు డేట్స్ ఇచ్చే ఛాన్స్ లేనేలేదు. ఇదే తరుణంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. శేఖర్ కమ్ముల టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ బ్యూటీతో లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఆ స్టార్ బ్యూటీ మరెవరో కాదు సమంత.


ఇప్పటికే సమంతతో శేఖర్ కమ్ముల సంప్రదింపులు కూడా ప్రారంభించారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ ఏడాది చివర్ లో లేదా వ‌చ్చే ఏడాది ఆరంభంలో సమంత, శేఖర్ కమ్ముల కాంబో ప్రాజెక్ట్ పట్టాలెక్క‌నుందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఒకవేళ నిజంగా శేఖర్ కమ్ముల స‌మంత‌తో లేడీ ఓరియంటెడ్‌ ప్రాజెక్టును సెట్ చేస్తే ఆయన సెలక్షన్ అదుర్స్ అనే చెప్పుకోవచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: