మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం `కన్నప్ప`. మంచు విష్ణు టైటిల్ పాత్రను పోషించగా.. మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో భాగమయ్యారు. అలాగే టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేశారు. దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన కన్నప్ప జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. సినిమా బాగోలేదని ఎవరు చెప్పలేదు. మెజారిటీ ఆడియన్స్ నుంచి మూవీకి పాజిటివ్ టాక్ లభించింది.


మంచు విష్ణు తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ఇక ప్రభాస్ యాక్ట్ చేయడంతో ఈ సినిమాకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. అందుకు తగ్గట్టే కన్నప్ప భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. కానీ రెండో రోజు నుంచి అనూహ్యంగా ఈ మూవీ కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వచ్చాయి. వారం రోజులు గడిచే సమయానికి కన్నప్ప థియేటర్ ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. హిందీ వెర్షన్ పరిస్థితి ప్ర‌త్యేకంగా చెప్పక్కర్లేదు.


ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌మ‌యానికి ఇండియాలో రూ. 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను వ‌సూల్ చేసిన క‌న్న‌ప్ప చిత్రం.. వ‌ల‌ర్డ్ వైడ్ గా దాదాపు రూ. 40 కోట్లు గ్రాస్ ను సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ద్వారా రూ.180 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాల్సి ఉందని ట్రేడ్ పండింతులు చెబుతున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు 30శాతం మాత్రమే రికవరీ అవ్వ‌డంతో క‌న్న‌ప్ప మంచు ఫ్యామిలీని ముంచేసింద‌ని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా, కన్నప్ప ఫస్ట్ వీక్ గ్రాస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి..


డే1 వ‌ర‌ల్డ్‌ వైడ్ కలెక్ష‌న్స్   - 16.25 కోట్లు
డే2 వ‌ర‌ల్డ్‌ వైడ్ కలెక్ష‌న్స్   - 10.40 కోట్లు
డే3 వ‌ర‌ల్డ్‌ వైడ్ కలెక్ష‌న్స్   - 9.45 కోట్లు
డే4 వ‌ర‌ల్డ్‌ వైడ్ కలెక్ష‌న్స్   - 2.80 కోట్లు
డే5 వ‌ర‌ల్డ్‌ వైడ్ కలెక్ష‌న్స్   - 2.20 కోట్లు
డే6 వ‌ర‌ల్డ్‌ వైడ్ కలెక్ష‌న్స్   - 1.55 కోట్లు
డే7 వ‌ర‌ల్డ్‌ వైడ్ కలెక్ష‌న్స్   - 1.20 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: