
టాలీవుడ్ హీరో నితిన్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉంది. నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకులను నిరాశకు గురి చేయగా తమ్ముడు మూవీ సైతం ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. తమ్ముడు మూవీ తొలిరోజు కేవలం 4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద హీరో సినిమాకు ఇంత తక్కువ స్థాయిలో కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు.
ఈ సినిమాకు దాదాపుగా 75 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయిందని మేకర్స్ చెబుతున్నారు. ఈ వార్త నిజమైతే మాత్రం నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఎన్ని వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందో చూడాలి. ఎంసీఏ సినిమా ఛాయలు ఉండటం కూడా ఈ సినిమాకు మైనస్ అయిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
తమ్ముడు సినిమా ఫలితం గురించి దిల్ రాజుకు సైతం ముందే తెలుసని నితిన్ సైతం మూవీ ప్రమోషన్స్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి కారణం ఇదేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తమ్ముడు సినిమా ప్లాప్ రిజల్ట్ ను అందుకున్న నేపథ్యంలో నితిన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.
తమ్ముడు సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు 10 కోట్ల రూపాయల మార్కును అందుకోవడం కూడా కష్టమని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తమ్ముడు సినిమాలో ట్విస్టులు ఒకింత ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. కథల ఎంపికలో నితిన్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. దిల్ రాజు సైతం తానూ నిర్మించే సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.