
రన్యారావు బెంగళూరులో విక్టోరియా లేఅవుట్లో ఒక ఇల్లుతో పాటుగా ఆర్కావతి లేఅవుటులో మరొక నివాసం ఉన్నదట.. అలాగే అనేకల్ తాలూకాలో ఉండేటువంటి వ్యవసాయ భూమి.. అలాగే తుమకూర్ లో ఉండే మరొక భూమిని మనీ లాండరింగ్ చట్టం కింద తాత్కాలికంగా జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటన్నిటి ఆస్తి మొత్తం విలువ సుమారుగా 34.12 కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. తన నెట్వర్క్ ఏజెంట్ల ద్వారా సుమారుగా 13 కోట్ల రూపాయలు విలువైన 14 కేజీల బంగారాన్ని సైతం అక్రమంగా దుబాయ్ నుంచి బెంగళూరుకు తరలిస్తూ ఉండగా విమానాశ్రయంలో ఈమెను పట్టుకోవడం జరిగింది.
అయితే అరెస్టు అనంతరం సుదీర్ఘకాలంగా జైలు జీవితాన్ని గడిపిన రన్యారావు ప్రస్తుతం సిబిఐ, డిఆర్ఐ అధికారులు సైతం దర్యాప్తు చేస్తున్నారు. నేరపురితంగానే డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం కారణంగా ఏమైనా అరెస్టు చేశారు అధికారులు. రన్యారావు స్మగ్లింగ్ కేసులో ఒక తెలుగు నటుడు ప్రమేయం కూడా ఉందని అతని కూడా పోలీసు అధికారులు విచారించినట్లు దర్యాప్తులో భాగంగా తెలియజేశారు. ఆ నటుడుతో కలిసి రన్యారావు చాలాసార్లు విదేశాలకు వెళ్లి వచ్చినట్లుగా కూడా అధికారులు ధ్రువీకరించారు. బ్యాంకు లావాదేవీలతో పాటుగా , వాట్సాప్ చాట్లు, పలు రకాల బిల్లులను కూడా కేసు దర్యాప్తుల ఉంచినట్లు సమాచారం. ఈ కేసులో నటి వేడుక అప్లై చేసిన కూడా కోర్టు మంజూరు చేయలేదు.