సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ సెలబ్రెటీస్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేసే వాళ్ళ లిస్ట్ ఎక్కువ అయిపోతుంది.  మరీ ముఖ్యంగా ఏ విషయంలోనైనా సరే అసలు సంబంధం లేకపోయినా స్టార్ సెలబ్రిటీని ట్రోలింగ్ చేస్తున్నారు . ఇప్పుడు సాయి పల్లవి కూడా అదే లిస్టులో బలి అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది . తన పని తాను చూసుకుని పోతూ అసలు కాంట్రివర్షియాలిటీకి దూరంగా ఉండే సాయి పల్లవిను కావాలనే కొంతమంది ఆకతాయిలు ట్రోల్ చేస్తున్నారు . మనకు తెలిసిందే ఇప్పుడు హీరోయిన్ సాయి పల్లవి టాప్ హీరోయిన్లలో ఒకరు . ప్రతి ఒక్క సినిమాలలో తనదైన పెర్ఫార్మన్స్ చూపిస్తుంది.
 

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ రామాయణంలో సీతాదేవి పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాని  నితీష్ తివారి తెరకెక్కిస్తున్నారు . రన్బీర్ కపూర్ రాముడి పాత్రలో ..యాష్ రావణుడిగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు . అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మండోదరిగా  నటిస్తుంది అంటూ ఓ న్యూస్ బయటికి వచ్చింది . అయితే ఇలాంటి మూమెంట్లోనే  సాయి పల్లవి ని ఓ  రేంజ్ లో ట్రోల్ చేసేస్తున్నారు ఆకతాయిలు.



రావణుడిగా యాష్ ఓకే.. రాముడిగా రణబీర్ కపూర్  కూడా ఓకే ..సీత పాత్రలో సాయి పల్లవి ని పెట్టి.. మడోదరి పాత్రలో కాజల్ ని పెట్టడం ఏంటి..? నాన్సెన్స్ .. అసలు కాజల్ ఫిజిక్ కి ఈ రోల్ ఏంటి..? కాజల్ రేంజ్ ఏంటి..? అంటూ  డైరెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు . మరికొందరు సాయి పల్లవి ని కూడా ట్రోల్ చేస్తున్నారు.  అసలు ఆమె సీత ఏంటి ..? ఉడత మొహం అంత ఉంటుంది.  ఈ ప్రాజెక్టులో ఎలా భాగం చేశారు .  రావణుడు లా కండలు ఉన్న యాష్.. బ్క్కపిల్ల సాయి పల్లవిని కిడ్నాప్ చేస్తే అసలు వర్క్ అవుట్ అవుతుందా..? మండోదరిగా అప్సరసలాంటి కాజల్ ని పెట్టుకుని రావణుడు సాయి పల్లవిని కిడ్నాప్ చేస్తే కన్విన్సింగ్గా  ఉంటుందా..? కామెడీగా ఉంటుంది అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు సాయిపల్లవి పై  ట్రోల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.  చాలామంది ఒకటి సాయి పల్లవి ని అయినా ఈ సినిమాలోంచి తీసేయండి.. లేకపోతే మడోదర పాత్రలో కాజల్ నైనా తీసేయండి.. అస్సలు చూడలేం అంటూ ఘాటు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు . చూడాలి మరి దీనిపై ఎలా రెస్పాండ్ అవుతాడో డైరెక్టర్..!?






మరింత సమాచారం తెలుసుకోండి: