సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి వేనపడుతూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం కొత్త దర్శకులు సినిమాలో ఏ విధంగా రూపొందిస్తారో తెలియకపోవడం , ఒక వేళ కొత్త దర్శకుడిని నమ్మి సినిమా బాధ్యతలను వారి చేతిలో పెట్టినట్లయితే ఆ మూవీ ని ఆదర్శకుడు బాగా తీయకపోతే ఆ సినిమా ద్వారా నిర్మాతకు నష్టాలు రావడం , ఆ హీరో అభిమానులు కూడా డిసప్పాయింట్ కావడం జరుగుతూ ఉంటుంది. దానితో స్టార్ క్రేజ్ ఉన్న హీరోలు ఎక్కువ శాతం కనీస అనుభవం ఉన్న దర్శకుల సినిమాలలో నటిస్తూ ఉంటారు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న రవితేజ మాత్రం కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో ఏ మాత్రం వెనకడుగు వేయడు.

ఆయన ఇప్పటివరకు తన కెరీర్ లో ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చాడు. అందులో కొంత మంది అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగించిన వారు కూడా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన శ్రీను వైట్ల కు రవితేజ మొదటి సినిమా అవకాశం ఇచ్చాడు. ఆయన అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు. ఇక బోయపాటి శ్రీను కు కూడా భద్ర మూవీతో మొదటి సినిమా అవకాశం ఇచ్చాడు. ఈయన కూడా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కొరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇక డాన్ శీను మూవీ తో గోపీచంద్ మలినేని , పవర్ మూవీ తో బాబి కొల్లి కి మొదటి సినిమాలతో అవకాశాలను ఇచ్చాడు. వీరిద్దరూ కూడా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమంలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇలా రవితేజ ఇచ్చిన అవకాశంతో ఈ దర్శకులు అంత అద్భుతమైన స్థాయికి చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: