
ఆ తర్వాత గద్దర్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ ఎలా బిహేవ్ చేశాడు అనేది సోషల్ మీడియా ద్వారా వీడియోస్ వైరల్ అవ్వడం ద్వారా మనం చూస్తూనే వచ్చం . కాగా ఇప్పుడు మరొకసారి స్టేజిపై అలాగే హైలెట్ పెర్ఫార్మన్స్ చూపించాడు అల్లు అర్జున్ . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాట్స్ 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆయన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు . అమెరికాలో ఉంటున్న తెలుగువారిని ఉద్దేశించి పుష్ప సినిమా పద్ధతిలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి .
తెలుగు వారంటే ఫైర్ అనుకున్నారా..? వైల్డ్ ఫైర్ అంటూ పుష్ప యాశలో చెప్పడం అక్కడ ఉండే జనాలు చప్పట్లు వర్షం కురిపించారు . అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది అని ఇక్కడ తెలుగువారిని చూస్తుంటే ఏదో హైదరాబాద్ విశాఖపట్నంలో ఈవెంట్ లో ఉన్నట్లే అనిపిస్తుంది అని .. అమెరికాలో మనమంతా ఇలా కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అంతేకాదు నన్ను ఇలాంటి కార్యక్రమానికి ఆహ్వానించిన నాట్స్ వాళ్లకి స్పెషల్గా థాంక్స్ అంటూ కూడా చెప్పుకొచ్చారు . ఇక నాట్స్ పై కూడా పుష్ప సినిమాలోని డైలాగ్ ను వాడుతూ "నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అంటూ మన తెలుగు కల్చర్ ను ముందు తరాలకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు.. అని భారతీయులు ఎక్కడున్నా తగ్గేదేలే అంటూ పుష్ప సినిమాలోని డైలాగ్ ను పదేపదే గుర్తు చేసుకున్నారు. అల్లు అర్జున్ స్టేజ్ పై మాట్లాడిన మాటలు బాగా హైలైట్ గా మారాయి . ఎలాంటి స్టేజ్ ఈవెంట్ లో అయినా సరే స్పీచ్ తో అల్లు అర్జున్ మొత్తం అటన్షన్ తన వైపు తిప్పుకుంటారు అని అందరూ అంటున్నాడు . మరొకసారి అదే ప్రూవ్ అయ్యింది..!