నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... బాబి కొల్లి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. మంచి అంచనాల నడవ విడుదల అయిన ఈ సినిమా మంచి సక్సెస్ను అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

అద్భుతమైన విజయం సాధించిన అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండటంతో ప్రస్తుతానికి అఖండ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత బాలయ్య , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ బాలయ్య కెరియర్ లో 111 వ మూవీ గా తెరకక్కనున్న నేపథ్యంలో ఎన్బికె 111 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని లాంచ్ చేశారు.

తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి గోపీచంద్ మలినేని అమెరికాలో నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (NATS) కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ... NBK 111 లో బాలయ్య బాబు ను ఇంకో కొత్త యాంగిల్ లో చూపిస్తాను అని వెల్లడించారు. ఇలా బాలయ్య నెక్స్ట్ మూవీ గురించి గోపీచంద్ మలినేని  చెప్పడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gm