
అయితే పవన్ తో విడిపోయిన సరే పవన్ దగ్గరికి పిల్లలని పంపిస్తూ ఉంటుంది. బిడ్డలకి తండ్రి ప్రేమ అందాలి అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది . కాగా గతంలో రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సడన్గా క్యాన్సిల్ చేసుకుంది. పిల్లలు చాలా చిన్నవాళ్ళు అని ఇప్పుడు పెళ్లి చేసుకొని నేను వెళ్ళిపోతే వాళ్ల జీవితాలను ఒంటరి చేసిన దాన్ని అవుతాను అని ఆమె నిర్ణయం తీసుకుంది . రీసెంట్ గా రెండో పెళ్లిపై స్పందించింది రేణుదేశాయ్ .
"నేను రెండో పెళ్లి చేసుకుంటాను.. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను రెండో పెళ్లి చేసుకోమంటూ బలవంతం చేస్తున్నారు. ఆఖీరా-ఆద్య కూడా మమ్మీ నువ్వు ఎవరితో హ్యాపీగా ఉంటే వాళ్లనే పెళ్లి చేసుకో అంటూ నాకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చేశారు .. మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను .. నా లైఫ్ లో ప్రేమ ఉండాలి.. నాకు ఒక మ్యారేజ్ లైఫ్ ఉండాలి " అంటూ డిసైడ్ అయ్యాను . ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే పిల్లలు చిన్నవాళ్లు కాబట్టి . వాళ్లకి నాన్న సపోర్ట్ లేకుండా అమ్మ రెండో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు అని ఆలోచించాను. నా పెళ్లి గురించి నా పిల్లలు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు.. నన్ను సెకండ్ మ్యారేజ్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నారు అంటూ చెప్పుకు వచ్చింది . మరి కొన్ని సంవత్సరాలు తర్వాత మాత్రమే నాకు పూర్తి స్వేచ్ఛ వస్తుంది. అప్పుడు నా జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలని భావిస్తున్నా. పిల్లలు కాలేజీకి వెళ్తే వాళ్ళకి కొత్త ప్రపంచం ప్రారంభం అవుతుంది . ఆ సమయంలో నేను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. దీనితో రేణు దేశాయ్ పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇక ఆమె పెళ్ళి చేసుకోదు ఏమో అని ఫీల్ అయిపోయారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంటాను అంటూ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఓ సర్ ప్రైజ్ లా ఫీల్ అవుతున్నారు..!!