సినిమా ఇండస్ట్రీ లో మంచి స్థాయికి వెళ్ళాలి అంటే అందం , అభినయం , నటన కంటే కూడా విజయాలు ముఖ్యం అని చాలా మంది చాలా సందర్భాలలో చెబుతూ వస్తూ ఉంటారు. కొంత మంది విషయంలో ఇది రాంగ్ అయిన ప్రూవ్ అయిన మరి కొంత మంది విషయంలో మాత్రం ఇది రైట్ అని ప్రూవ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందం , అభినయం , నటన అన్నింటితో ప్రేక్షకులను ఆకట్టుకున్న సరైన విజయాలు లేక ఓ ముద్దు గుమ్మ తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ అవకాశాలను దక్కించుకోలేకపోతోంది. ఆమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యువతను తన అందంతో మైమరిపించింది.

కానీ ప్రస్తుతం ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆ బ్యూటీ మరెవరో కాదు ... కళ్యాణి ప్రియదర్శన్. ఈ ముద్దుగుమ్మ అఖిల్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన హలో అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం  అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా ఈ మూవీలో కళ్యాణి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈ నటికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె చిత్రలహరి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఈమె శర్వానంద్ హీరోగా రూపొందిన రణరంగం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈమె నటించిన సినిమాలలో చాలా సినిమాలు తెలుగు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈమె తన అందంతో , నటనతో చాలా మంది యూత్ ఆడియన్స్ మనసును కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా ఇతర భాషల్లో చాలా సినిమాలు చేస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kp