
రజనీకాంత్ ,శృతిహాసన్, నాగార్జున ,అమీర్ ఖాన్, సత్యరాజ్ తదితర నటీనటులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ సాంగ్ కి అప్డేట్ చిత్ర బృందం తెలియజేశారు. పూజా హెగ్డే మోనికా అనే సాంగ్లో కనిపించబోతోంది. ఈ పాటలో గ్లామర్ గర్ల్ గా పూజ హెగ్డే స్పెషల్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి అఫీషియల్ పోస్టర్ని కూడా చిత్ర బృందం విడుదల చేయడంతో ఒక్కసారిగా ట్రెండీగా మారిపోయింది. ఈ పోస్టర్లో పూజా హెగ్డే రెడ్ గౌన్ వేసుకొని ఫుల్ స్వింగ్ లో కనిపిస్తోంది. మొత్తం బ్యాక్ డ్రాప్ అంతా కూడా రెడ్ కలర్ నే హైలెట్ చేశారు.
మోనికా క్యారెక్టర్ ను ప్రజెంటేషన్ చేయడానికి సరికొత్త విజువల్ ని చిత్ర బృందం ఉపయోగించబోతుందట. ఈలుకుల పూజ హెగ్డే చాలా గ్లామర్ గా కనిపిస్తోంది. కూలి సినిమాలో మోనికా పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. జూలై 11 సాయంత్రం 6 గంటలకు ఈ పాటని విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే రెట్రో సినిమా తర్వాత కూలి సినిమాలో కనిపించబోతోంది. అయితే ఈ పాటను అమెరికాలో చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. మరి కూలీ సినిమాకి మోనికా పాత్ర ఎలా స్పెషల్గా నిలుస్తోందొ చూడాలి మరి.