గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ఈమె రామ్ పోతినేని హీరో గా వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా 2006 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఇలియానా తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజీ సినిమాలలో అవకాశాలు వచ్చాయి.

ఈమె నటించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఈమె తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. ఈమె నటించిన మొదటి సినిమా అయినటువంటి దేవదాసు నుండి ఈ బ్యూటీ తప్పుకోవాలి అని అనుకుందట. మరి ఎందుకు ఈమె ఆ సినిమా నుండి తప్పుకోవాలి అనుకుంది అనే వివరాలను తెలుసుకుందాం. దేవదాసు సినిమా సెట్స్ లో జరిగిన కొన్ని కారణాల వల్ల ఈమె చాలా బాధపడిందట. దానితో ఏడ్చి ఆ సినిమా నుండి తప్పుకుందాం అని అనుకుందట.

ఆ తర్వాత తన తల్లికి ఫోన్ చేసి సినిమా నుండి తప్పుకోవాలి అనుకుంటున్నట్లు చెప్పిందట. దానితో ఇలియానా తల్లి అలా చేయకు అని ఆమెను సర్ది చెప్పిందట. ఆ తర్వాత ఆమె కూడా సర్దుకొని దేవదాసు సినిమాను పూర్తి చేసిందట. ఇక దేవదాసు సినిమాతో ఈమెకు అద్భుతమైన విజయం , సూపర్ సాలరీ క్రేజ్ దక్కింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఇలియానా ఎక్కువ శాతం హిందీ సినిమాల్లో నటిస్తూ కెరియర్ను ముందుకు తీసుకు వెళుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: