కరోనా కంటే ముందు భారతదేశానికి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఓ టీ టీ కంటెంట్ చూసేవారు కాదు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు కొంత కాలం పాటు దేశ వ్యాప్తంగా థియేటర్లు బంద్ కావడం , టీవీ లలో కూడా కొత్త కంటెంట్ కరువు కావడంతో ఓ టి టి లో ఉన్న కంటెంట్ ను చూడడానికి భారతదేశ ప్రజలు బాగా అలవాటు పడ్డారు. ఇప్పటికీ కూడా ఓ టీ టీ లో చాలా పెద్ద మొత్తంలో కంటెంట్ను భారతదేశ ప్రజలు చూస్తూ వస్తున్నారు. దానితో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ ల వారు కూడా భారీగా డబ్బులను సంపాదించుకుంటున్నాయి. ఇకపోతే ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ కలిగిన ఓ టీ టీ సంస్థలలో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఒకటి. దీనికి భారతదేశంలో మంచి క్రేజ్ ఉంది.

ఇకపోతే తాజాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ పై బాలీవుడ్ దర్శకులలో ఒకరు అయినటువంటి అనురాగ్ కశ్యప్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆయన నెట్‌ఫ్లిక్స్ గురించి మాట్లాడుతూ ... నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు భారతదేశంలో ఎలాంటి కంటెంట్ ప్రేక్షకులు చూస్తారు అనే దానిపై పెద్దగా అవగాహన లేదు. భారతీయ ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారనే అనే విషయంపై కూడా నెట్‌ఫ్లిక్స్ కి సరైన క్లారిటీ లేదని కశ్యప్ తాజాగా ఆరోపించారు. అది మాత్రమే కాకుండా నెట్‌ఫ్లిక్స్ ఇండియా కార్యాలయం ఇచ్చే తప్పుడు సమాచారాన్ని నెట్‌ఫ్లిక్స్ సీఈవో నమ్ముతున్నారు అని అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చారు. నెట్‌ఫ్లిక్స్ సంస్థ వారు ఒక వేళ ఇండియాలో అత్తా కోడళ్ళ సీరియల్స్ ను స్టార్ట్ చేసి ఉండుంటే ఇంకా ఎక్కువ లాభపడేది అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇలా తాజాగా బాలీవుడ్ దర్శకుడు అయినటువంటి అనురాగ్ కశ్యప్ నెట్‌ఫ్లిక్స్ ప్రవర్తనపై చాలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈయన చేసిన వ్యక్తులు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ak