ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా పుష్ప పార్ట్ 1 , పుష్ప పార్ట్ 2 మూవీలతో సూపర్ సాలిడ్ విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ను సంపాదించుకున్నాడు. బన్నీ తన తదుపరి మూవీని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీ తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అలాగే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను కూడా మేకర్స్ విడుదల చేశారు.

ఆ ప్రచార చిత్రాలను బట్టి చూస్తే ఈ మూవీ భారీ గ్రాఫిక్స్ సినిమా అని అర్థం అవుతుంది. దానితో ఈ మూవీ ప్రొడక్షన్ ఖర్చు అత్యంత భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి అని కూడా అర్థం అవుతుంది. ఈ సినిమా ప్రొడక్షన్ ఖర్చు పక్కన పెడితే ఈ మూవీలో నటించే నటీనటులకు ఇచ్చే పారితోషకాలు కూడా భారీ ఎత్తున ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బన్నీ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే దీపికా పదుకొనేను అధికారికంగా కన్ఫామ్  చేశారు. ఇక మృనాల్ ఠాకూర్ కూడా ఈ మూవీ షూటింగ్లో ఇప్పటికే జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఈమె నటించబోతున్నట్లు అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రష్మిక మందన కూడా హీరోయిన్గా నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అలాగే ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణి జాన్వి కపూర్ కూడా హీరోయిన్గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నలుగురితో పాటు మరో బ్యూటీ కూడా ఈ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదేగాని జరిగితే ఈ మూవీ ప్రొడక్షన్ ఖర్చుతో పాటు ఈ సినిమాలో నటించే నటీనటులకు ఇచ్చే పారితోషకాలు కూడా భారీ ఎత్తున ఉంటాయి అని దానితో ఈ సినిమా బడ్జెట్ అత్యంత భారీగా అవుతుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: