చలనచిత్ర పరిశ్రమలో చెర‌గ‌ని ముద్ర వేసిన లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఆయ‌న తుదిశ్వాస విడిచారు. కోట మ‌ర‌ణం చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఒక తీర‌ని లోటు. నాలుగు పదుల వయసుకు చేరువవుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కోట.. సైడ్ రోల్స్ వేస్తూ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వయసుకు తగ్గ పాత్రల‌ను ఎంచుకుంటూ వైవిధ్యం ప్రదర్శిస్తూ కెరీర్ లో ముందుకు సాగారు.


నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 750 కి పైగా చిత్రాల్లో నటించారు. కోట మొద‌ట చిత్రం చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన `ప్రాణం ఖ‌రీదు` కాగా.. చివరి చిత్రం `హరిహర వీరమల్లు`. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఎ.ఎం రత్నం, ఏ దయాకర్ రావు నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్ నిర్మితమైన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాపాడుతుంది.


ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ను కోట శ్రీ‌నివాస‌రావు పోషించారు. అయితే స్క్రీన్ పై ఆయ‌న పాత్ర నిడివి చిన్న‌దే అయిన కూడా రెమ్యునరేషన్ మాత్రం భారీగా ఇచ్చారట. హరి హరి వీరమల్లు కోసం కోట దాదాపు ఐదు రోజులు షూటింగ్ లో పాల్గొన్నారు. అందుకుగానూ నిర్మాత ఎ.ఎంరత్నం కోట శ్రీ‌నివాస‌రావుకు రూ. 4 లక్షల రెమ్యున‌రేష‌న్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. అదే ఆయన ఆఖ‌రి పారితోషికంగా చెబుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: