ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో లోకేష్ కనకరాజ్ ఒకరు. ఈయన మా నగరం అనే సినిమాతో దర్శకుడిగా మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన ఖైదీ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈయన క్రేజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన మాస్టర్ , విక్రమ్ , లియో సినిమాలలో విక్రమ్ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. లోకేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా కూలీ అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు.

మూవీ లో నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... ఉపేంద్ర , శృతి హాసన్ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్లను కూడా ఈ చిత్ర బృందం ఇప్పటికే మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన కొన్ని పాటలను మేకర్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో లోకేష్ వరుస పెట్టి ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆయన తనకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా లోకేష్ మాట్లాడుతూ ... ఆగస్టు 14 వ తేదీన కూలీ సినిమా విడుదల కాబోతోంది. ఆ మూవీ విడుదల రోజు మూడు షో లు చూస్తాను. ఆ తర్వాత రోజు నుంచి స్కూల్ ఫ్రెండ్స్ తో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికైనా వెళ్లిపోతా. ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటా అని లోకేష్ కనకరాజ్ తెలిపారు.  ప్రస్తుతానికి కూలీ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Lk