
వ్యాంప్ పాత్రల తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నూ తనదైన ముద్ర వేసింది . ‘రెడీ’, ‘సీమటపాకాయ్’, ‘అఖిల్’, ‘డేంజర్’, ‘హరే రామ్’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి ఎన్నో చిత్రాల్లో తన పాత్ర తో ఆకట్టుకుంది . ఆమె నటనకే కాదు , అపూర్వ అందానికీ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది . తెర పై క్యారెక్టర్ లు చేయడమే కాకుండా, గ్లామర్ పాత్రల కూ వెనుకాడలేదు . అందుకే ఆమెను ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు సినిమాల్లో అపూర్వ కనిపించటం తక్కువగానే ఉన్నా , సోషల్ మీడియా లో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు .
ఇన్‌స్టాగ్రామ్ , ఫేస్‌బుక్ వేదికగా రెగ్యులర్‌గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు . ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతూ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఎప్పటికీ తరగని అందంతో , అప్పటి కుర్రకారు గుర్తుచేసేలా… ఇప్పుడు కూడా ఆమె స్టైల్ యూత్‌కు ఇంట్రస్టింగ్ గా అనిపిస్తోంది. నటన , గ్లామర్ రెండూ కలిపి హట్ బ్యూటిగా పేరు తెచ్చుకున్న అపూర్వ ఇప్పటికీ పలువురు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నటి. నటన అందంతో ఆకట్టుకున్న అపూర్వ క్రేజీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.