ఈ మధ్య  కాలంలో ఇది ఒక బాగా ట్రెండ్ లా మారిపోయింది . పాత సినిమాలలో హిట్ అయిన పాటలను మరొకసారి రీమేక్  చేస్తూ తమ సినిమాలకు వాడుకుంటున్నారు హీరోలు . అయితే ఇప్పటివరకు ఒక హీరో సినిమాలోని పాటను ఆ కుటుంబంలోని ఎవరైనా హీరో రీమేక్ చేస్తూ వచ్చారు. లేకపోతే అదే హీరో ఆ పాటను  మళ్ళీ రీమేక్ చేసుకుంటూ హైలెట్ అయ్యారు . అయితే ఇప్పుడు మాత్రం ఓ హిట్ హీరో సినిమాలోని పాటను మరో హీరో హిట్ కొట్టడానికి వాడుకుంటున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.


ఇండస్ట్రీలో మాస్ మహారాజ అనగానే రవితేజ అందరికి గుర్తు అవ్స్తాడు. ఆయన కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా "వెంకీ". ఈ సినిమా ఎంత బాగుంటుందో..పాటలు కూడా అంతే బాగుంటాయి. మరీ ముఖ్యంగా ఓ పాట అయితే మాత్రం ఇప్పటికి జనాలను ఆకట్టుకుంటుంది. అదే "గోంగూర తోట కాడ కాపుకాసా". ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రామ్ పోతినేని ప్రజెంట్ "ఆంధ్ర కింగ్ తాలూకా" అనే సినిమాలో నటిస్తున్నాడు .



సినిమా షూటింగ్ సరవేగంగా కంప్లీట్ చేసే పనిగా ముందుకు వెళ్తున్నారు మూవీ మేకర్స్.  అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఓ హిట్ పాటను చూస్ చేసుకున్నారట మూవీ మేకర్స్. ఆ పాట మరేంటో కాదు ..వెంకీ సినిమాలోని "గోంగూర తోట కాడ కాపు కాసా" అనే సాంగ్ . ఈ పాటను రాంపోతేనేని తన "ఆంధ్ర కింగ్ తాలూకా" సినిమాలో రీమేక్ చేయబోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ పాటలో భాగ్యశ్రీ బోర్సే  అదేవిధంగా రామ్ పోతినేని ఓ రేంజ్ లో మాస్ స్టెప్స్ తో కుమ్మేయబోతున్నారు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . చూద్దాం మరి ఈ పాట ఎలా ఆకట్టుకుంటుందో..?? రామ్-భాగ్య శ్రీ ఎలా చిందులు వేయబోతున్నారో..??

మరింత సమాచారం తెలుసుకోండి: