సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం.. ఇందులో స్టార్ స్టేటస్ సంపాదించడం అంటే అంత సులువైన పని కాదు.. ఒకవేళ అలా సంపాదించుకున్నప్పటికీ ఆ ఇమేజ్ ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ని అందుకోగా మరి కొంతమంది తక్కువ సమయంలోనే కనుమరుగవుతూ ఉంటారు. కొన్నిసార్లు స్టార్ స్టేటస్ దక్కించుకున్నప్పటికీ అవకాశాలు తగ్గడంతో తీవ్ర ఒత్తిడికి గురైన సందర్భాలు ఉంటాయని చాలామంది సెలబ్రిటీలు కూడా తెలియజేశారు. కానీ ఒక బుల్లితెర నటి బుల్లితెరపై ఒక వెలుగు వెలిగి ఇప్పుడు దీనమైన స్థితిలో బ్రతుకుతోంది.



ఆమె ఎవరో కాదు బెంగాలీ నటి సుమీ హర్ చౌదరి.. ఎన్నో సీరియల్స్ లో నటించి చివరికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నదట. కేవలం రోడ్డు పక్కనే నివసిస్తూ ఉంటూ తనకు ఆశ్రమం ఇవ్వాలని అందరిని వేడుకుంటోంది. తాజాగా వైరల్ గా మారిన ఫోటోలలో విషయానికి వస్తే షార్ట్స్, నల్లచొక్క ధరించుకొని కాగితం పై (ఇంగ్లీష్, బెంగాలీ) లో ఏదో రాస్తూ తడబడుతూ మాట్లాడుతున్న సుమీ హర్ చౌదరి చూసి చాలామంది గుర్తుపట్టలేదట. తాను ఒక నటి అని తనకు సహాయం చేయాలంటూ అడుగుతూ ఉండగా ఆమె పేరును కొంతమంది గూగుల్లో సెర్చ్ చేయగా అందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు కూడా బయటికి వచ్చాయి.


అక్కడే ఉన్న కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సైతం అక్కడ చేరుకొని సుమీ చౌదరిని  విచారించారు.. అయితే మొదట ఆమె కోల్ కత్తా నివాసి అని చెప్పిన ఆ తర్వాత తాను బోల్పూర్ కు చెందిన వ్యక్తి అంటూ తెలిసింది. విచారించిన తర్వాత ఈమె నటి అని గుర్తించిన పోలీసులు పునరావాస కేంద్రానికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యుల వివరాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేశారు అధికారులు. మొత్తానికి ఒకప్పుడు స్టార్ స్టేటస్ అందుకని ఇప్పుడు రోడ్డున  పడ్డ నటిని చూసి  ఆశ్చర్యపోతున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: