
అసలు నీకు మనస్సాక్షి ఉందా..? అంటూ డైరెక్టర్ ను అడిగి కడిగేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు సుకుమార్. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గానే పుష్ప 2 సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. త్వరలోనే రామచరణ్ ని డైరెక్ట్ చేయబోతున్నారు . ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు సుకుమార్ . అయితే ఈ సినిమాలో హీరోయిన్ కి అమ్మ క్యారెక్టర్ లో జెనీలియాని చూస్ చేసుకున్నారట సుకుమార్ .
హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ తల్లి పాత్రలో జెనీలియా కనిపించబోతుంది అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది . అంటే ఒక విధంగా రాంచరణ్ కి అత్త క్యారెక్టర్ అని చెప్పాలి . ఒకప్పుడు రామ్ చరణ్ - జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించారు . జెనీలియా చరణ్ కు లవర్ గా యాక్ట్ చేసింది. ఆరెంజ్ సినిమా వీళ్ళ కాంబోలో వచ్చి డిజాస్టర్ గా మిగిలింది. కానీ వీళ్ళ మధ్య వచ్చిన సీన్స్ మాత్రం బాగా హైలైట్ గా మారాయి . ఒకప్పుడు చరణ్ తో లవర్ గా నటించినా జెనీలియా ఇప్పుడు ఆయనకు అత్త క్యారెక్టర్ లో నటిస్తుంది ఏంటి..? ఈ కాంబినేషన్ సుకుమార్ అంటూ కొందరు ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . అసలు నీకు మనస్సాక్షి లేదు ..చరణ్ లాంటి హీరో పక్కన జెనీలియా ని అత్త చేస్తావా..? అంటూ కొంతమంది అభిమానులు బర్సట్ అయిపోయి కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!