
ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలిచింది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోలకు జోడిగా నటించి అతి తక్కువ సమయంలో బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకొని హాలీవుడ్ రేంజ్ కి ఎదిగింది.నిరంతరం సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో ట్రెండీగా మారుతూ ఉంటుంది. 2018లో అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. తన భర్త కంటే పది సంవత్సరాలు ప్రియాంక చోప్రా పెద్దది.
అయితే ఈ జంట పైన వినిపించే విమర్శలను పట్టించుకోకుండా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ప్రియాంక చోప్రా. వీరికి ఒక పాప కూడా జన్మించింది. అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా తన ఇంస్టాగ్రామ్ నుంచి ఒక వీడియోని షేర్ చేస్తూ తన భర్తతో కలిసి మరి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ..తన భర్త పైకి ఎక్కి మరి లిప్ లాక్ తో రెచ్చిపోయి ముద్దు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియో చూసి అభిమానులు వైరల్ గా చేస్తున్నారు. కొంతమంది క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేయగా మరికొంతమంది ఏంటి ప్రియాంక ఇదేం అరాచకం అంటూ తిడుతున్నారు.