
ఇకపోతే, తాజాగా విడుదలైన ‘సయారా’ పాటకు భారీ స్పందన రావడంతో.. దాని థియేటర్లలోనే వార్ 2 ట్రైలర్‌ను ప్లే చేస్తే బాగుండేదని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. టీజర్‌కి మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో దాన్ని రీ-ప్లే చేయడం వల్ల ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. అదే సమయంలో, హరి హర వీరమల్లు సినిమా థియేటర్లలో వార్ 2 ట్రైలర్‌ను స్క్రీన్ చేయాలని కోరుతున్నారు, తద్వారా సౌత్ మార్కెట్ లో హైప్ పెంచే అవకాశముంటుందంటున్నారు. ట్రైలర్ విడుదలకు ముందు ఒక చిన్న ప్రోమో వచ్చే వారం రిలీజ్ చేసే అవకాశముంది. అంతేకాదు, ట్రైలర్ విడుదల తర్వాత హైదరాబాద్, ముంబయి, చెన్నై, బెంగళూరు, కోచి లాంటి నగరాల్లో ప్రెస్ మీట్లు, ఫుల్ ప్రమోషన్ కార్యక్రమాల్ని ప్లాన్ చేస్తున్నారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి ప్రమోషన్ చేయడం కంటే విడివిడిగా చేస్తేనే వేరైటీ ఉంటుందని నిర్మాత ఆదిత్య చోప్రా భావిస్తున్నారట. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొంత టైం తీసుకోవాల్సిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. కానీ అసలైన హైలైట్ మాత్రం ఎన్టీఆర్ – హృతిక్ మధ్య సాగే ఫేస్ ఆఫ్ కావడం విశేషం. ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే - వార్ 2 ట్రైలర్ కూలీకి ముందే వస్తుందా? లేక తర్వాతా? ఇది కేవలం ట్రైలర్ పోటీ మాత్రమే కాదు, బాక్సాఫీస్ ప్రీ-హైప్ వార్ కూడా. మరో వారం దాకా ఆగితే అసలు గేమ్ ఎవరిది అనేది క్లారిటీ వస్తుంది!