- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి పార్ట్ వన్ రిలీజ్ అయ్యి 10 ఏళ్లు అవుతుంది. ఆ తర్వాత రెండేళ్లకు వచ్చిన బాహుబలి 2 సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ రెండు సినిమాలు తెలుగు సినిమా దశ దిశ ని మార్చేశాయి. బాహుబలి 1 రిలీజై 10 ఏళ్లు అయిన సందర్భంగా.. రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్. దీనికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది. ఈ సందర్భంగా యూనిట్‌లోని కీలక సభ్యులు అందరూ ( అనుష్క త‌ప్ప ) గెట్ టు గెదర్ అయ్యారు. మరోసారి ఆ సినిమా అనుభవాలు, అనుభూతులు నెమరు వేసుకున్నారు. ఇక రెండు భాగాలు కలిపి బాహుబలి ది ఎపిక్ పేరిట అక్టోబర్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని కొన్ని అదనపు సన్నివేశాలు కూడా యాడ్ చేస్తున్నారు.


అక్టోబర్‌లో రీ రిలీజ్ అంటూ ఇప్ప‌టినుంచే దశలవారీగా ప్రచారం చేయాలని కూడా నిర్ణయించారు. రీ రిలీజ్ సినిమాకు ఇంత హంగామా ఎందుకు అంటే.. అదే టైంలో పార్ట్ 3 కూడా ప్రకటిస్తారని చర్చ నడుస్తోంది. బాహుబలి 3 ప్రణాళికను దర్శకధీరుడు రాజమౌళి అండ్ టీం ఇప్పటినుంచి సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలోనే బాహుబలి 3 ఉండొచ్చు అని రైటర్ విజయేంద్రప్రసాద్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓ సందర్భంలో రాజమౌళి కూడా పార్ట్ 3 వస్తే బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు అక్టోబర్‌లో ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమౌళి కుటుంబం నుంచి ఏ విషయం వెంటనే బయటికి రాదు. ఆ కుటుంబంలో ఎవరు లీక్‌లు ఇవ్వ‌రు కాబట్టి.. బాహుబలి పార్ట్ 3పై క్లారిటీ రావడానికి ఇంకాస్త టైం పట్టే అవకాశం కనిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: