సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాక కొంత మంది కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలను అందుకున్న ఆ తర్వాత మాత్రం ఆ స్థాయిలో కెరియర్ను ముందుకు సాగించడంలో విఫలం అవుతుంటారు. కానీ కొంత మంది మాత్రమే చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించడం మాత్రమే కాకుండా వరుస పెట్టి అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను తప్పించుకుంటూ ఉంటారు.

ఈ కోవాలోకి చాలా మంది హీరోయిన్లు వస్తారు. చాలా కాలం పాటు అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించి ఇప్పుడు కూడా వరుస అవకాశాలతో బిజీగా కెరియర్ను కొనసాగిస్తూ ఇటు టాలీవుడ్ , అటు కోలీవుడ్ రెండు ఇండస్ట్రీలలో కూడా సూపర్ సాలిడ్ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటున్న బ్యూటీలు ఇద్దరు ఉన్నారు. వారు ఎవరు అని అనుకుంటున్నారా ..? వారు మరెవరో కాదు ... త్రిష , నయనతార. వీరిద్దరు కూడా తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ కూడా చాలా సినిమాల్లో నటించి చాలా తక్కువ కాలంలోనే మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగించారు. ఒకానొక దశలో వీరిద్దరూ తెలుగు సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి కేవలం తమిళ సినిమాల్లోనే నటిస్తూ స్టార్ హీరోయిన్లుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ను కొనసాగించారు. 

మళ్లీ వీరిద్దరూ ఓ వైపు తమిళ సినిమాల్లో నటిస్తూనే మరో వైపు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ అనేక తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో త్రిష , చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... నయనతార తెలుగులో చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇలా వీరిద్దరూ ఇటు టాలీవుడ్ , అటు కోలీవుడ్ ఇండిస్ట్రీలలో అద్భుతమైన అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: