యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో వార్ 2 అనే హిందీ సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల రోజే సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమా కూడా విడుదల కానుంది. ఈ రెండు సినిమాలపై కూడా ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు మూవీ లు కూడా పాన్ ఇండియా మూవీలుగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నాయి.

దానితో ఈ రెండు సినిమాల మధ్య పెద్ద క్లాష్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేపుతుంది. వార్ 2 సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక కూలీ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏసియన్ సునీల్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వార్ 2 మూవీ ని యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ వారు నిర్మించడం , ఈ సంస్థకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన పట్టు ఉండడంతో ఈ సినిమా నార్త్ ఇండియాలో పెద్ద మొత్తంలో విడుదల అవుతుంది. ఈ సినిమాకు నార్త్ ఇండియా నుండి భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తాయి అని , కూలీ సినిమాకు ఆ రేంజ్ కలెక్షన్లు నార్త్ ఇండియాలో రావడం కష్టం అని చాలా మంది అంచనా వేశారు.

కూలీ సినిమా యొక్క నార్త్ ఇండియా హక్కులను పెన్ స్టూడియో సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పెన్ స్టూడియో సంస్థకు నార్త్ ఇండియాలో గట్టి పట్టు ఉంది. దానితో కూలీ సినిమా కూడా నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అని , దానితో కూలీ మూవీ కి కనుక మంచి టాక్ వస్తే వార్ 2 మూవీ కి చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: