గత కొంత కాలంగా ఇండియన్ సినీ లవర్స్ ఓ టి టి లో సినిమాలను చూడడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇండియాలో అత్యధిక మంది సబ్ స్క్రిప్షన్ తీసుకున్న ఓ టి టి సంస్థలలో నెట్ ప్లెక్స్ ఒకటి. ఇకపోతే ఇప్పటివరకు అత్యధిక మంది నెట్ ఫ్లిక్స్ ఓ టి.టి ప్లాట్ ఫామ్ లో అత్యధిక మంది వీక్షించిన టాప్ 10 ఇండియన్ మూవీస్ లిస్ట్ ను ఈ సంస్థ విడుదల చేసింది. ఆ లిస్ట్ ప్రకారం ఈ లిస్టు లో ఏ మూవీ లు చోటు దక్కించుకున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
జవాన్ : షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ మూవీకి 31.90 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
గంగుబాయి కటియావాడి : ఆలియా భట్ ప్రధాన పాత్ర లో రూపొందిన ఈ సినిమాకు 29.64 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
లాపతా లేడీస్ : ఈ మూవీ కి 29.50 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
యానిమల్ : రన్బీర్ కపూర్ హీరో గా రూపొందిన ఈ మూవీ కి 29.20 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
క్రూ : ఈ మూవీ కి 27.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఫైటర్ : ఈ మూవీ కి 26.30 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
సైతాన్ : ఈ మూవీ కి 24 మిలియన్ వ్యూస్ వచ్చాయి.