సినిమా ఇండస్ట్రీ లో ఓ మూవీ స్టార్ట్ కాకముందు ఓ స్టోరీ రెడీ అయ్యాక ఆ స్టోరీ విషయంలో అనేక అభిప్రాయాలను దర్శకులు సేకరించడం, అందులో కొంత మంది పాజిటివ్గా ఫీల్ అవ్వడం , కొంత మంది నెగటివ్గా ఫీల్ అవ్వడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "రామయ్య వస్తావయ్య" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో సమంత , శృతి హాసన్ హీరోయిన్లుగా నటించగా ... హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఈ సినిమాకు పని చేసిన తోట ప్రసాద్ అనే కథ రచయిత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజాగా తోట ప్రసాద్ మాట్లాడుతూ ... నాకు హరీష్ శంకర్ మంచి స్నేహితుడు. నేను కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన నాకు ఎంతో సహాయం చేశాడు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య అనే సినిమాకు కమిట్ అయ్యాక ఆ మూవీ స్టోరీ డిస్కర్షన్ లో నేను కూడా పాల్గొన్నాను. ఇక ఆ సినిమా స్టోరీ మొత్తం కంప్లీట్ అయ్యాక దానిని మాకు వినిపించాడు.

స్టోరీ మొత్తం విన్నాక నేను ఫస్టాఫ్ కథ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ లో కథ ఏమీ లేదు , ఇది జనాలకు నచ్చడం కష్టం అని నేను హరీష్ శంకర్ కి  చెప్పాను. దానితో హరీష్ శంకర్ కాస్త ఫీల్ అయ్యాడు. తారక్ గారికి అద్భుతంగా నచ్చిన కథ. సినిమా ఆల్రెడీ ఓకే అయింది. ఈ కథ నీకు నచ్చలేదా అని అన్నాడు. ఇక తీరా ఆ సినిమా విడుదల అయ్యాక ఆ సినిమా కూడా పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపలేదు అని తోట ప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: