టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విడుదల అవుతుంది అంటే దానికి కొన్ని రోజుల ముందు నుంచే పెద్ద ఎత్తున హడావిడి మొదలవుతూ ఉంటుంది. ఆయన అభిమానులు సినిమా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొల్పుతూ ఉంటారు. పవన్ నటించిన సినిమాలకు హిట్టు , ఫ్లాప్ టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అదే ఆయన నటించిన సినిమాకు గనక మంచి టాక్ వచ్చినట్లయితే ఆ మూవీ కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ రేపు అనగా జూలై 24 వ తేదీన విడుదల కానుంది. పవన్ చాలా కాలం తర్వాత నటించిన స్ట్రెట్  మూవీ కావడంతో ఈ మూవీ పై ఆయన అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ టికెట్ బుకింగ్లు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఈ ఏరియాలో ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయినా అవి నిమిషాల్లో క్లోజ్ అవుతున్నాయి. ఇలా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన టికెట్లు ప్రస్తుతం హార్ట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి.

ఇక ఈ రేంజ్ లో ఈ మూవీ బుకింగ్స్ జరుగుతూ ఉండడంతో ఈ సినిమాకు గనక మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లయితే ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేయడం ఖాయం అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఏం ఏం కీరవాణి సంగీతం అందించగా ... ఈ మూవీ లో ఏ ఏం రత్నం నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: