పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరో గా నటించాడు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... ఏ ఏం రత్నం ఈ సినిమాని నిర్మించాడు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా ... బాబి డియోల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ రేపు అనగా జూలై 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో పవన్ భారీ ఎత్తున ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లను నిర్వహిస్తూ వస్తున్నాడు.

దాదాపు పవన్ ఎక్కువ శాతం తన సినిమా విడుదల అయినా కూడా ప్రమోషన్లకు దూరంగా ఉంటాడు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం భారీ ఎత్తున ప్రమోషన్లను చేస్తాను అని పవన్ స్వయంగా చెప్పాడు. అందులో భాగంగా ఒకే రోజు రెండు ఈవెంట్లలో పాల్గొని ఈ సినిమా గురించి అద్భుతంగా చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా పవన్ తాను రాజకీయాల్లోకి రావడానికి అలాగే ఎన్నో వడిదలుకులను ఎదుర్కొని  నిలబడడానికి ఒక సినిమా కారణం అయ్యింది అని చెప్పుకొచ్చాడు. అసలు విషయం లోకి వెళితే ... పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం జానీ అనే సినిమాలో హీరోగా నటించి ఆ మూవీ కి దర్శకత్వం కూడా వహించిన విషయం మనకు తెలిసిందే. మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది.

తాజాగా పవన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ... జానీ సినిమా ఫ్లాప్ అయ్యాక దానిని తట్టుకొని నిలబడ్డాను. అలాగే ఆ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చేశాను. ఆ మూవీ ఫలితం ఇచ్చిన ధైర్యమే నన్ను రాజకీయాల్లో నిలబడేలా చేసింది అని పవన్ చెప్పుకొచ్చాడు. ఇలా పవన్ కి జానీ మూవీ ద్వారా అపజయం రావడం వల్లే పవన్ రాజకీయాల్లో నిలదొక్కుకున్నారు అని చెప్పుకొచ్చాడు. దానితో జానీ సినిమా ఫ్లాప్ అయిన పవన్ కి బాగా కలిసి వచ్చింది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: