పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ మరికొద్దిగంటలో విడుదలవుతున్న వేళ ఆయనపై ఓ వర్గం ప్రేక్షకులు, ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు వేరే ఎవరైనా హీరోల సినిమాలు హిట్ అయి పేరు వస్తే పవన్ అభిమానులు అస్సలు ఓర్వరని సోషల్ మీడియాలో వాళ్లకు నెగటివ్ గా ఏదో ఒక పోస్టులు పెడుతూ సినిమాపై దుష్ప్రచారం చేస్తూ ఉంటారనే టాక్ టాలీవుడ్ లో ఉంది. ఇక అలా ప్రచారం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా విడుదలయితే ఆ హీరోల అభిమానులు ఊరుకుంటారా.. వాళ్లు కూడా ఊరుకోరు. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా విడుదలవబోతున్న వేళ Boycott హరిహర వీరమల్లు అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తూ రెచ్చిపోతున్నారు.. 

అయితే తాజాగా తన సినిమాపై ఇలాంటి నెగెటివిటీ వస్తున నేపథ్యంలో బాయికట్ ట్యాగ్ ట్రెండింగ్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా సినిమాపై కొంతమంది నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. టికెట్ కి అన్ని అన్ని వందలా ఇన్ని వందలా అని మాట్లాడుతున్నారు. అలాగే బాయ్ కట్ కూడా ట్రెండింగ్ చేస్తున్నారు. అసలు ఆ సినిమాకి బాయికట్ ట్రెండింగ్ చేయాల్సిన అవసరం ఏముంది.. సినిమా బాయికట్ లు వంటివి ఏమీ నడవవు..అయినా బాయికట్ ని ఎవరు పట్టించుకోరు. ఒక సినిమాని సెంటర్ పాయింట్ లో ఎవరు చూపించారు. ఎవరిష్టం ఉంటే వాళ్లు సినిమాలకు వెళ్తారు. ఎంత డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కోవాలి అనేది వాళ్ల ఇష్టంతో కూడుకున్న పని.

 చిన్నతనంలో నేను హీరోల సినిమాలు చూడడానికి వెళ్ళినప్పుడు టికెట్ దొరకకపోతే మా కజిన్స్ నాకు బ్లాక్ లో టికెట్ కొనిచ్చి ఇచ్చేవారు. సినిమాకి వెళ్లాలంటే ఎవరు ఛాయిస్ వారిది. ఇష్టమైన సినిమాకి వెళ్లేటప్పుడు బాయికట్ చేయమని అడిగినా కూడా ఎవరూ ఆ పని చేయరు. సినిమా హీరో, సినిమా నచ్చకపోతే వెళ్లడం వెళ్లకపోవడం అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ బాయికట్ అయితే అందరూ చేయరు. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా చాలామంది ఉంటారు. అలాంటి వారు ఉండరు అని అనుకోవడం మన అవివేకమే. కాబట్టి వ్యతిరేకంగా ఉన్న ప్రత్యర్థులు ఏం చేసుకుంటే అది చేసుకోనివ్వండి.ఏ పని చేసిన సంతోషమే అంటూ పవన్ కళ్యాణ్ బాయికట్ హరహర వీరమల్లు అనే యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: