తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన యువ నటుడు అయినటువంటి విజయ్ దేవరకొండకు అదిరిపోయే రేంజ్ హిట్ ఇచ్చిన దర్శకులను సందీప్ రెడ్డి వంగ ఒకరు. విజయ్ దేవరకొండ కెరియర్ ప్రారంభంలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో విజయ్ క్రేజ్ ఒక్క సారిగా భారీగా పెరిగిపోయింది. సందీప్ "అర్జున్ రెడ్డి" మూవీ తోనే దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. దర్శకత్వం వహించడం మొదటి సినిమా అనే బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈయనకు కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.

మరోసారి విజయ్ దేవరకొండ కోసం సందీప్ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. అది విజయ్ తో సినిమా గురించి కాదు ... విజయ్ సినిమా ప్రమోషన్ గురించి. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను జూలై 31 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో విజయ్ పెద్ద ఎత్తున ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్లను నిర్వహించాలి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా విజయ్ ,  సందీప్ రెడ్డి తో ఓ ఇంటర్వ్యూ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా విజయ్ కోసం సందీప్ మరోసారి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. ఇక వీరిద్దరి కాంబోలో ఇంటర్వ్యూ రాబోతుంది అని తెలియడంతో జనాలు కూడా ఆ ఇంటర్వ్యూ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. కింగ్డమ్ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd