సినిమా ఇండస్ట్రీ అంటేనే  రంగులతో కూడుకున్న ప్రపంచం.. కెమెరా ముందు నటించాలి అంటే ఏ విధంగా రంగులు పూసుకుంటామో, కెమెరా బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది రంగులు పూసుకున్నట్టే ప్రవర్తిస్తూ ఉంటారు.. వారి నిజమైన క్యారెక్టర్ తెలియాలి అంటే వారి ప్రవర్తనను దగ్గరుండి చూస్తేనే అర్థమవుతుందని నటి మాళవిక మోహనన్ అన్నారు.. ఇండస్ట్రీలో కొంతమందిని దగ్గర నుంచి గమనించానని వారంతా పైకి పెద్ద వాళ్ళలా కనిపిస్తున్నా లోపల మాత్రం దారుణమైనటువంటి క్యారెక్టర్ ఉంటుందని చెప్పకనే చెప్పారు.. మరి మాళవిక మోహనన్ ఎవరిని అన్నారో ఆ వివరాలు ఏంటో చూద్దాం.. మాళవిక మోహనన్ 2013లోనే 'పట్టం పోలే' అనే మలయాళ చిత్రం ద్వారా  సినీ ఫీల్డ్ లోకి అరంగేట్రం చేసింది. 

ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తమిళ్, హిందీ, మలయాళం, కన్నడం, తెలుగు వంటి పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పాటు చేసుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టి  తానేంటో నిరూపించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ తో 'ది రాజా సాబ్' మూవీ లో నటిస్తోంది. అలాంటి మాళవిక మోహనన్ సినిమా విషయంలో చాలా స్పీడ్ గా దూసుకుపోతున్నా కానీ తన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న విషయాల గురించి ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. సినిమా పరిశ్రమలో చాలా తారతమ్యాలు ఉంటాయని మగా, ఆడ మధ్య చాలా తేడాలు చూపిస్తారని అన్నది..అందులో టాలెంట్ ఉన్నవారు మాత్రమే ఎదుగుతారు. సినీ ఇండస్ట్రీలో మగవాళ్ళకు ఒక రెమ్యూనరేషన్, ఆడవారికి మరో రెమ్యూనరేషన్ ఎందుకు అంటూ ప్రశ్నించారు..

చాలా విషయాల్లో హీరోయిన్లను తగ్గించి చూస్తారని అన్నారు.. ఇక కొంతమంది నటులైతే మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చినట్టు పైకి కనిపిస్తూ మేక వన్నెపులుల్లా ఉంటారని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ముఖానికి అందమైన మాస్క్ వేసుకున్న పలువురు నటులను తాను దగ్గరుండి చూసానని తెలియజేశారు. వాళ్లను చాలామంది బుద్ధిమంతులు అనుకుంటారని కానీ మనం అనుకున్నంత  బుద్ధిమంతులు కాదని, వారు కెమెరా ముందు ఏ విధంగా నటిస్తారో, నిజ జీవితంలో కూడా ఆ విధంగానే నటిస్తూ  ఉంటారని మాళవిక మోహనన్ తెలియజేశారు.. ఆమెకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలిగిందో ఏమో తెలియదు కానీ ఈ విషయాలను ముక్కుసూటిగా బయటపెట్టింది. కానీ ఆ నటులెవరో వారి పేర్లు మాత్రం బయట పెట్టలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: