దాదాపు రెండేళ్ల గ్యాప్ అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ `హరిహర వీరమల్లు` మూవీతో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గురువారం వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఇప్పటికే బుక్‌ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ వేదికగా అన్ని భాషల్లోనూ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. వీర‌మ‌ల్లు టికెట్స్ హాట్ కేకుల్లా సోల్డ్ అవుట్ అవుతున్నాయి.


ఇకపోతే ఏపీ మరియు తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్ తో పాటు టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో ప్రీమియర్ షోల బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఎంపిక చేసిన సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ లలో బుధ‌వారం రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. ఏపీ స‌ర్కార్ ప్రీమియర్ షో టిక్కెట్ల ధరలను రూ.600కి పరిమితం చేసింది. జీఎస్టీ అదనంగా వసూలు చేయబడుతుంది. రెక్ల‌యినర్/సోఫా సదుపాయం కలిగిన టికెట్ ధర రూ. 1000 దాటగా.. బాల్కనీ సీటు ధర రూ. 830, సెకండ్ క్లాస్ రూ. 790గా నిర్ణ‌యించారు. అలాగే జూలై 24 నుంచి మల్టీప్లెక్స్ ల‌లో రాయల్ సీటింగ్ కు రూ. 495, ఎగ్జిక్యూటివ్ రూ. 377గా ధరలు చూపిస్తోంది. సింగల్ స్క్రీన్స్ విష‌యానికి వ‌స్తే.. బాల్కనీ రూ. 250, రూ. ఫస్ట్ క్లాస్ 150 గా నిర్ణయించారు. బుకింగ్ ఛార్జీలు అదనం.


మరోవైపు తెలంగాణలో జూలై 24వ తేదీ నుంచి పెంచిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా మల్టీప్లెక్స్ ల‌లో రాయల్ సీటింగ్ కు రూ. 500, ఎగ్జిక్యూటివ్ రూ. 413 ఛార్జ్ చేయ‌నున్నారు. సింగిల్ స్క్రీన్ థియేట‌ర్స్‌ లో బాల్కనీ రూ. 300, ఫ్రెంట్ సర్కిల్ రూ. 200గా ఫిక్స్ చేశారు. వీటికీ బుకింగ్ ఛార్జీలు అదనం. అయితే ప్రీమియర్ షోల టికెట్ బుకింగ్స్ తెలంగాణంలో ఇంకా ఓపెన్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: