సాధారణంగా కొన్ని చిత్రాలలో కొన్ని సీన్స్ షూట్ చేయడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు దర్శకులు. సీన్ బాగుండాలని కొన్ని సందర్భాలలో అటు హీరో ,హీరోయిన్స్ కూడా చాలాసార్లు రీటెక్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే ఒక సినిమా సుమారుగా 29 సంవత్సరాల క్రితం విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా ఈ సినిమాలో ఒక ముద్దు కోసం 47 సార్లు రీటెక్ చేశారు. అలాంటి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నది.


సినిమా ఏదో కాదు బాలీవుడ్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న రాజా హిందుస్తానీ. 1996లో నవంబర్ 15న విడుదలైన ఈ చిత్రం భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలోని పాటలు కూడా సూపర్ హిట్టుగా అయ్యాయి. ముఖ్యంగా పరదేశి పరదేశి అనే పాట ఇప్పటికి చాలా చోట్ల వినిపిస్తూనే ఉంటుంది. డైరెక్టర్ ధర్మేష్ దర్శన్  డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో కరిష్మా కపూర్, అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా అప్పట్లోనే రూ .6కోట్ల రూపాయలతో తెరకెక్కించగా రూ .76.34 కోట్ల రూపాయలని రాబట్టింది. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.


1996 లోనే ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్న రాజా హిందుస్థాన్ మూవీ ఒక అందమైన ప్రేమ కథ చిత్రం గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి అప్పట్లో యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు. అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ మధ్య వచ్చే లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది. ఇది ఊటీలో చిత్రీకరించారు. అయితే అక్కడ ఎక్కువగా చలిగా ఉండడం చేత షూటింగ్ సమయంలో అటు చిత్ర బృందంతో పాటు నటీనటులు కూడా చాలా ఇబ్బంది పడ్డారట. ఈ సినిమాలోని లిప్ లాక్ కోసం 47 రీటేకులు  తీసుకోవలసి వచ్చిందట. ఈ చిత్రం ఇప్పటికీ జియో సినిమాలో అందుబాటులో ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: