1998 జూలై 24 అంటే 27 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు రిలీజ్ అయిన తొలిప్రేమ తొలి ఆట నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అందమైన లవ్ స్టోరీ, ఎమోషనల్ సీన్స్, అద్భుతమైన సాంగ్స్, మంచి కామెడీతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. అప్పట్లోనే రూ.8.6 కోట్ల షేర్ ను రాబట్టి బయ్యర్లకు భారీ లాభాలను మిగిల్చింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డుతో పాటు ఆరు రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకుంది. టాలీవుడ్ లో ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయిన తొలిప్రేమ విడుదలైన రోజే `హరి హర వీరమల్లు`తో పవన్ ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి మెజారిటీ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి